తెలంగాణలో రేషన్ కార్డులును జారీ చేసేందుకు అర్హైలన వారినుండి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే తాజీ మాజీ ఎమ్మెల్యే పేరు ఉండడంతో గ్రామ సభల పాల్గొన్నవారు విస్మయం చెందారు, అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యేను వివరణ కొరగా తాను దరఖాస్తు చేయలేదన్నారు. వివరాలకు వెళ్ళితే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గంలోని నల్లబెల్లి మండలంలో 23న బుధవారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ కార్యదర్శి ధర్మేందర్ పేర్లను చదివారు . రేషన్ కార్డుల జాబితాను పరిశీలించగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరుతో దరఖాస్తు (ఐడీ నెం.18608965) కనిపించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడమేంటని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ దరఖాస్తు పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరునామాతో కూడిన నల్లబెల్లిలో ఇంటి నెంబరు (6-86), లెంకాలపల్లి రోడ్డు, పేరుతో ఉంది. ఫోన్ నంబరు సైతం ఆయనదే ఉంది.ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసినట్లు తెలిసింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావడంతో దరఖాస్తు తిరస్కరిస్తామని అధికారులు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించిన ‘పెద్ది సుదర్శన్ రెడ్డి ’ పేరుతో రేషన్‌కార్డు దరఖాస్తు ఉండటంతో నర్సంపేట నియెజకవర్గంలో నలుగురు కూడిన చొట ఇదే మాట వినిసిస్తుంది.నల్లబెల్లి మండలం నుంచి 85 దరఖాస్తులు మీసేవ ద్వారా వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని అధికారుల వివరణ కోరగా తాను దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు. జాబితాలో తన పేరు ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలన్నట్టు సమాచారం