ఆయుధం హనుమకొండ
హనుమకొండ జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ విద్యాసంస్థల సమీపంలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై పటిష్టమైన నిఘాను ఉంచాలని, విద్యా సంస్థలలో మత్తు పదార్థాల నియంత్రణపై కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడంలో చర్యలు చేపట్టాలన్నారు. మార్చి నెలలో గంజాయి 72 కిలోలను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకు సంబంధించి నాలుగు కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎం. ఎ.భారీ, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోపాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.