హైదరాబాద్: ఆయుధం
చలో మేడి గడ్డకు బీఆర్ఎస్ పార్టీ నేతలు హైదారబాద్ నుండి బయలు దేరారు.బీఆర్‌ఎస్ చలో మెడిగడ్డ పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్షాకాలంలో వరద వస్తే బరాజ్ కొట్టుకపోవాలి అని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిరామారావు అన్నారు.నేడు చేస్తున్న పర్యటన మొదటి పర్యటన మాత్రమే.. తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తాం రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి భాద్యులపై చర్యలు తీసుకోండి రైతులను బలి చేయొద్దని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు.