వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంతో ప్రతి కార్యకర్త వ్యక్తిగత భేదాభిప్రాయాలు వీడి సమిష్టిగా కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పరకాల పట్టణ, పరకాల, నడికుడ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టిష్టతపై రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి చర్చించారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో వ్యక్తిగత భేదాభిప్రాయాలు పక్కన పెట్టి నాయకులు సమిష్టిగా కృషి చేయాలని గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఫలితాల కంటే రెట్టింపు ఫలితాలు వచ్చే విధంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని కోరారు. కష్టపడ్డ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు గౌరవం ఉంటుందని బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని గత అసెంబ్లీ ఎన్నికలలో మరియు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ప్రాతిపదికన స్థానిక సంస్థల లో, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందించడం జరుగుతుందని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ లను నూటికి నూరు శాతం నెరవేర్చడంతో పాటు ప్రజారాంజక పాలన అందించి అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందడం జరుగుతుందని రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బిజెపి మనకు పోటీ కానే కాదని వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయా పార్టీలను ప్రజలు బొంద పెట్టడం ఖాయమని అన్నారు.