ఆయుధం హన్మకొండ
హన్మకొండ జిల్లాలోని నిరుద్యోగ బి.సి యువతి యువకులకు తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకారసంస్థ లిమిటెడ్,నిరుద్యోగ బి.సి. యువతి యువకులకు,తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ లోని హకీంపేట్ లో ఉచిత డ్రైవింగ్ కోర్సులో HMV (హెవీ మోటారు వాహనం) & LMV (తెలికపాటి మోటారు వాహనం) శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానించుచున్నదని హన్మకొండ జిల్లా బిసి సంక్షేమ అధికారి రాంరెడ్డి తెలిపారు.ఈ డ్రైవింగ్ HMV & LMV శిక్షణ కాలం వ్యవధి 38 రోజులు( 304 గంటలు). ఈ శిక్షణ పూర్తయిన తర్వాత, సంబందిత రవాణా సంస్థ అర్హత కలిగిన అభ్యర్ధులకు పర్మినెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు..అభ్యర్ధులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం హకీంపేట్, హైదరాబాద్ లోని TA & ZSTC (TGRTC) ద్వారా అందించబడుతుందని వివరించారు.(LMV) కొరకు18 నుండి 45 సంవత్సరాల వరకు,HMV కొరకు కొరకు 20 నుండి 45 సంవత్సరాల వయస్సు లోపల ఉండాలని విద్యార్హత 8వ తరగతి ఉత్తీర్ణత, ఆధార్ కార్డు, కుల దృవీకరణ పత్రం, ఆదాయ దృవీకరణ పత్రం, గ్రామీణప్రాంతంవారు ఒకలక్షయాబైవేల రూపాయాలు, పట్టణప్రాంతం రెండు లక్షలు రూపాయాలు కల్గి ఉండాలని ఒక సంవత్సరం క్రితం సర్టిఫికేట్ 3 పాస్ పోర్ట్ ఫోటోలు LMV లెర్నింగ్ లైసెన్స్ (LLR) – LMV అభ్యర్థులకు HMV లెర్నింగ్లైసెన్స్ (LLR) – HMV అభ్యర్ధులకు. సర్టిఫికెట్లు తప్పనిసరి ఉండాలని తెలిపారుఈ సదవకాశాన్ని నిరుద్యోగులు వెనుకబడిన తరగతుల యువతి యువకులు ట్రాన్స్ జెండర్లు వినియోగించుకోవలసినదిగా కొరారు. ఆసక్తికలిగిన నిరుద్యోగ బీసీ యువతి యువకులకు అభ్యర్థులు దరఖాస్తు / పత్రాలను జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి కార్యాలయం, హనుమకొండ (Dist. BC Development Office) పని వేళలో మార్చి 31 సాయంత్రం 5.00 గంటల వరకు పూర్తి సర్టిఫికెట్లు సమర్పించవలసినదిగా జిల్లా బిసి సంక్షేమ అధికారి జి. రాంరెడ్డి సూచించారు.