బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌ను పోలీసులు సొమావారం నాడు అరెస్టు చేశారు. గతంలో హైదరాబాద్ గతేడాది జరిగిన పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న సాహిల్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వేంటనే అతడు పోలీసుల నుంచి తప్పించుకుని దేశం విడిచి దుబాయ్ కి పారిపోయాడు . అతడి కోసం అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా సోమావారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగానే విమానాశ్రయంలో సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాహిల్‌ను పోలీసులు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో హాజరుపరుచారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నాడు.