మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వరంగల్ నగరంలోని ములుగు రోడ్ లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పులామాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లుడుతూ సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.సామాజిక కార్యకర్తగా,వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడనిపేర్కొన్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలేకు ఘన నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజశ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , కూడా చైర్మన్ ఇనాగల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.