Thursday, May 22, 2025

E-Paper

Homeతెలంగాణముత్యాల సాయి సింధు సిఎం సహాయ నిధికి విరాళం

ముత్యాల సాయి సింధు సిఎం సహాయ నిధికి విరాళం

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న మూడు వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ఎ.రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేయగా ముఖ్యమంత్రి ఆ అమ్మాయిని అభినందించారు.

Most Popular