Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణరాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.శనివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురుస్తోంది. సిద్దిపేట, నిజామాబాద్, అదిలాబాద్ వర్షాలతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నారు. వరి,మొక్క.జోన్న,మామిడి రైతులు అకాల వర్షానికి నష్టపోయారు. రాజధానిలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. విధ్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడింది.మరోవైపు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట పొలంలోనే నీళ్లపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పంట కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దయిపోయిందని రైతులు వాపోతున్నారు. రాగల రెండు మూడు రోజుల వరకు అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.జనగామ జిల్లా జఫర్గగఢ్ మండలం ఉప్పుగల్లు,తిమ్మంపేటతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యంతడిసిముద్దైనది. వర్ష సూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Most Popular