గ్రేటర్ వరంగల్ నగరం లో భారీ వర్షాల నేపద్యం లో సోమవారం కమీషనర్ అశ్విని తానాజీ వాకడే.. నగరంలోని పలు కాలనీలలో అధికారులతో కలసి పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన వీ డి ఓ స్ కాలనీ, బాపూజీ నగర్ ఇందిరమ్మ కాలనీ, ఎన్ ఎన్ నగర్, బి ఎన్ నగర్, ఉర్సు ప్రభుత్వ పాఠశాల, డీకే నగర్ తెలంగాణ కాలనీ మైసయ్య నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు, జలమయమైన ప్రాంతాలను క్షేత్ర స్థాయి లో పరిశీలించి ఎలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని కమీషనర్ అశ్విని తానాజీ వాకడే.. అధికారులను ఆదేశించినారు.