కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల మాట్లాడుతూ
సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురుదెబ్బ తగిలిందని,గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 50 రూపాయాల మేర పెంచిందన్నారు.. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య వినియోగదారులపై , రాష్ట్ర ప్రభుత్వంపై కలిపి ప్రతినెలా భారీ ఆర్థిక భారాన్ని మోపనుందని తెలిపారు..తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ వినియోగం గణనీయంగా ఉందని, అంచనాల ప్రకారం రాష్ట్రంలోని వినియోగదారులు ప్రతి నెలా దాదాపు కోటి వరకు వంటగ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారని. ఈ ధరల పెరుగుదల నేరుగా వారిపై నెలకు అదనంగా 50 కోట్ల భారాన్ని మోపనుందని వ్యక్తం చేశారు.ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు మరింత భారంగా మారనుంది అన్నారు పేదల యొక్క ఆర్థిక భౌతిక పరిస్థితులను దృశ్య పెంచినటువంటి ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రంగశాయిపేట ఏరియా నాయకులు ధర్మారపు సాంబమూర్తి,మంజుల, ఉదయశ్రీ, స్వాతి, రజియా, రజిని, షమీనా, మల్లయ్య, బద్రి, యాకోబు, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు