అతి చిన్న వయస్సులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు,కరెన్సీలను ఆనర్గళంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం అభినందించారు. కెయూసి పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న దామెరుప్పుల దేవేందర్,స్వప్న దంపతుల కుమారుడు తేజస్వీ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి చదువుచున్న దామెరుప్పుల అక్షిత్ అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబందించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పడంతో ఈ బాల మేధావి ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అక్షిత్ పేరును తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారుల విభాగంలో నమోదు చేసి గుర్తింపు పత్రాన్ని జారీచేసారు. ఈ పత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బాల మేధావికి అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా బాల మేధావి తల్లిదండ్రులతో పాటు, ట్రైనీ రఘును అభినందిస్తూ మాట్లాడుతూ పిల్లల ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, సహకారాన్ని అందించడం ద్వారా చిన్నారులు భవిష్యత్తులో ప్రతిభావంతులుగా గుర్తించబడుతారని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.