ఆయుధం హన్మకొండ:పదేండ్ల మోడీ పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందని అందుకు మరోసారి బిజెపికి ఓటు వేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం హన్మకొండ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మైదానంలో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ వారితో మమేకమయ్యారు.దేశాభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు మోడీ పాలనను కోరుకుంటున్నారని, నరేంద్రమోడీ 10 సంవత్సరాల పాలనలో దేశం సుభిక్షంగా, సురక్షితంగా, అభివృద్ధి పదంలో పయనిస్తుందని, మరో సారి బిజెపికి ఓటు వేసి నరేంద్రమోడీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకమని, ఈసారి వరంగల్ పార్లమెంట్ స్థానంలో బిజెపి అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, మామునూరు విమానాశ్రయం, ఏనుమాముల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు ఇక్కడి యువత కు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి కృషితో వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకాలతోపాటు కాజీపేటలో రైల్వే వేగన్ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు,కిసాన్ మొర్చ రాష్ట్ర ఉపాద్యక్షులు తిరుపతి రెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు అమరేందర్ రెడ్డి,రావుల కిషన్,జిల్లా పదాదీకారులు అమర్నాథ్ రెడ్డి,మహేందర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి,రాజశేకర్ రెడ్డి,నరెంట్టశ్రీనివాస్,విజయ్,వాసుదేవరెడ్డి,శ్రీనివాస్ గౌడ్, సతీష్,మల్లికార్జున్,పద్మజ,గోపిక,తదితరులు పాల్గొన్నారు