Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణవరంగల్ పశ్చిమ, పరకాల శాసనసభ నియోజకవర్గాలకు ఈవీఎం లను కేటాయింపు

వరంగల్ పశ్చిమ, పరకాల శాసనసభ నియోజకవర్గాలకు ఈవీఎం లను కేటాయింపు

ఆయుధం హనుమకొండ: దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని హనుమకొండ జిల్లాకు సంబంధించిన పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల( ఈవీఎంల)ను కేటాయించారు.శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల కేటాయింపు జరిగింది.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల కేటాయింపు జరగగా హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు తరలించగా వాటిని అక్కడ భద్రపరిచి సీల్ వేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలకు ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా హనుమకొండ, పరకాల ఏఆర్వోలు వెంకటేష్, నారాయణ, ఇతర అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Most Popular