వరంగల్ పరిధిలోని పిన్నవారివీధి, ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధం గా సింగిల్ యుజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న ఎనిమిది దుకాణాలపై బల్దియాకు చెందిన అధికారులు,సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించి ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని ప్లాస్టిక్ విక్రయిస్తున్న విక్రయదారులకు ఒక లక్ష మూడు వేల పెనాల్టీ విధించి అట్టి దుకాణాలను సీజ్ చేసి ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా సి ఎంహెచ్ ఓ మాట్లాడుతూ నగరాన్ని ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించడం జరిగిందని, ఇట్టి నేపధ్యం లో బల్దియా వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులతో గతంలో సమావేశం ఏర్పాటు చేసి సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయించవద్దని సూచించడం జరిగిందని అయినప్పటికీ కొంతమంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడం జరిగినా క్రమంలో దాడులు నిర్వహించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందని, భవిష్యత్తులో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య,నరేందర్ సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, జవాన్లు తదితరులు పాల్గొన్నారు