Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణవినూత్న శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించి అధిక రాబడి పొందాలి.

వినూత్న శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించి అధిక రాబడి పొందాలి.

ఆయుధం వరంగల్
వినూత్న శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించి అధిక రాబడి పొంది ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ లోని రంగశాయిపేట ఎస్ కే ఫంక్షన్ హాల్ లో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ముగింపు సమావేశానికి గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆధునికమైన విత్తనాలు, తగినంత విద్యుత్ సరఫరా సులభతరమైన మార్కెట్ అందుబాటులో పొందేటట్లు చూసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈలాంటి రైతు ఉత్పాదక మేళాలు రైతుల్లో కొత్త అధ్యాయానికి బాటపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో ఒక నూతన అధ్యాయాన్ని జోడిస్తాయని అన్నారు.మండలాల్లో కూడాఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు .ఈ మేళా ద్వారా నిష్ణాతులైన శాస్త్రవేత్తలు అందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ సేంద్రియ పద్ధతులను అమలు చేసి ఎఫ్ పిఓలు  అభివృద్ధి సాధించాలన్నారు.పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నియంత్రించేలా ఒక ఎఫ్ పిఓ తయారుచేసిన టీ కప్పుల మాదిరిగా వినూత్నంగా ఆలోచించి ఆవిష్కరణ చేయాలని అన్నారు.రైతు ఉత్పాదక సంస్థల ద్వారా రైతులు ఉత్పత్తులను సమష్టిగా మార్కెటింగ్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ చేసుకోవాలన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండి వాటి ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ తెలిపారు.రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళ 2025 కుతెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 40 కి పైగా ఎఫ్ పి ఓలు.వ్యవసాయ అనుబంధ శాఖలు 10కి పైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు.సాంకేతికత బదిలీలో భాగముగా వివిధ విషయ నిష్ణాతులు , ఎఫ్పీఓలకు రైతు ఉత్పత్తిదారు సంఘాల స్వావలంబన, వ్యవసాయ అనుబంధ రంగాలలో పాటించవలసిన మెలకువలు, వివిధ రుణ సదుపాయములపై అవగాహన, బాంకు లింకేజ్, విభిన్నతతో, వైవిధ్యంగా ఎఫ్ పిఓలు చేపట్టవలసిన కార్యక్రమాలు, కార్యచరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాలు వాటి సద్వినియోగం, వివిధ శాఖలకు చెందిన విషయ నిష్ణాతులతో అనుసంధానం తదితర అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి సంగీతలక్ష్మి, సంఘటితంగా నిర్వర్తించవలసిన కార్యక్రమాలు,జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, వ్యవసాయం పౌల్ట్రీ, పశువుల, గొర్రెల పెంపకం పైన ఆపేడ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పెద్ద స్వామి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్  ఎగుమతి తదితర అంశాలపై, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ శరత్ బాబు, విత్తన ఉత్పత్తి, వివిధ లైసెన్సులు పొందే ప్రక్రియ, హిందుస్థాన్ ఇండియా లిమిటెడ్,వెంకట సుధాకర్ సురక్షిత పురుగుమందుల వాడకంపై అవగాహన, సంయుక్త సంచాలకులు, మార్కెటింగ్ శాఖ శ్రీనివాస్ మార్కెటింగ్ లింకేజీ పైన అవగాహన, జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఉమా రెడ్డి, వ్యవసాయ సాగులో అధునాతన పద్ధతులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వరంగల్, అధ్యక్షులు రవీందర్ రెడ్డి వాణిజ్య అంశాల పైన,కరాని రాజేష్, ఎండుమిర్చి ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఎగుమతుల పైన అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఈ మేళలో వివిధ ఏఫ్ పీ ఓలు 40 స్టాళ్ళుఏర్పాటు చేయగా, అందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన స్టాల్ నిర్వాహకులకు.కలెక్టర్ చేతుల మీదుగ్స్ ప్రథమ, ద్వితీయ , తృతీయ నగదు బహుమతులు అందించడం తో పాటు 37 స్టాళ్ల ఎఫ్ పీ ఓ ప్రతినిధులకు సర్టిఫికెట్లు మరియు మెమొంటోలు కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ మూడు రోజుల మేళాలో సుమారు 40 ఎఫ్.పి.ఓలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయని, విక్రయించాయని, దాదాపు 2500 మంది రైతులు ఈ మెళను సందర్శించారు. సుమారు లక్షన్నర రూపాయల ఎఎఫ్ పీఓల ఉత్పత్తులు స్టాళ్లలో అమ్మకం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి( డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్) రమన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోహన్ రావు, నాబార్డు ఏజీఎం రవి, లీడ్ బ్యాంకు మేనేజర్ వరంగల్ రాజు, కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్, మామునూరు రాజన్న, జిల్లాకు చెందిన వ్యవసాయ అనుబంధ శాఖల మండల, క్లస్టర్ గ్రామస్థాయి అధికారులు, 600 మందికి పైచిలుకు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Most Popular