Friday, November 8, 2024

E-Paper

Homeతెలంగాణసమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ: జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు సమన్వయంతో సకాలంలో పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జడ్పీ ప్రత్యేకాధికారి పి.ప్రావీణ్య అన్నారు.గురువారం హనుమకొండలోని జిల్లా పరిషత్ హాలులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లు, జిల్లా పరిషత్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 58 అభివృద్ధి పనులకు సంబంధించి 1.31 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు అదనపు వనరులు సమకూర్చుకోవడానికి ఉన్న మార్గాలను ఆలోచించాలని అన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న భవనానికి మరమ్మతులు చేయించి సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్తులలో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో పాటు జిల్లా పరిషత్ కు, మండలాలకు సంబంధిత సాధారణ నిధుల గురించిన వివరాలను, అధికారులు సిబ్బందికి సంబంధించిన వివరాలు, అధికారులు సిబ్బందికి సంబంధించిన జిపిఎఫ్ వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో విద్యాలత, డిప్యూటీ సీఈవో రవి, ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లు, జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు.

Most Popular