Friday, November 29, 2024

E-Paper

Homeతెలంగాణసమస్యల పరిష్కారానికి కార్యాచరణ- క్యాంపు ఆఫీసులో వినతులు స్వీకరించిన మంత్రి సురేఖ

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ- క్యాంపు ఆఫీసులో వినతులు స్వీకరించిన మంత్రి సురేఖ

వరంగల్‌, ఆయుధం:
ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఉదయం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న మంత్రి ఒక్కొక్కరిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు క్యాంప్ ఆఫీసు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి కి వివరించారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడి చాలా వరకు సమస్యలను మంత్రి సురేఖ అక్కడికక్కడే పరిష్కరించారు. గతంలో అధికారులకు నివేదించి, పరిష్కారానికి నోచుకోని విజ్ఞప్తులపై ఆరా తీసిన మంత్రి, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. గతంలో వచ్చిన దరఖాస్తులు, వాటిలో పరిష్కారానికి నోచుకున్నవి, పలు కారణాలతో పెండింగ్ లో వున్న దరఖాస్తుల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మంత్రి సురేఖ ఓపిగ్గా తమ సమస్యలను విని పరిష్కారం చూపినందుకు గాను ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజలే ప్రథమ ప్రాధాన్యమని, ప్రజల సంక్షేమమే పరమావధి అని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు. వరంగల్ తూర్పులోనూ, హైదరాబాద్ లోనూ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో వుంటానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Most Popular