Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణసర్వే తీరును ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలన

సర్వే తీరును ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలన

ఆయుధం హనుమకొండ: సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని శ్రీనగర్ కాలనీ లో ఎన్యుమరేటర్లు సర్వే చేస్తుండగా సర్వే తీరును ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్, సూపర్వైజర్లతో మాట్లాడారు. ఎన్యుమరేటర్ నమోదు చేసుకున్న వివరాలను పరిశీలించారు. వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారని ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఇంటికి సర్వే చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు. సర్వే చేస్తున్న ప్రాంతంలో ఎన్ని ఎన్యుమరేషన్ బ్లాకులు ఉన్నాయని , ఎన్ని ఎన్యుమరేషన్ బ్లాకులలో సర్వే పూర్తయింది అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంబంధిత సర్వే ప్రాంతంలోని కుటుంబాలకు ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లయితే త్వరగా సర్వే పూర్తి చేయవచ్చునని ఎన్యుమరేటర్, సూపర్వైజర్లకు సూచించారు. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా సర్వే చేయాలన్నారు. ఎన్యుమరేటర్ కు సంబంధిత బ్లాక్ లలో సర్వే చేసినప్పుడు ఆ ప్రాంతం నలువైపులా హద్దులు తెలిసి ఉండాలన్నారు. సర్వే చేసిన ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారా లేదా అనేది మున్సిపల్ అధికారులు తమ సిబ్బందికి తెలియజేయాలన్నారు. సర్వే చేసిన ప్రతి కుటుంబం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎన్యుమరేటర్, సూపర్వైజర్లకు సర్వేకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Most Popular