Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణహనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు

హనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు

హనుమకొండ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, టీజీవో ప్రతినిధులు, అధికారులతో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ను కలిసి స్వీట్స్ అందజేసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఉద్యోగులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని, శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెడుపై విజయమే హోలీ అర్థం అని, ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. జగన్ మోహన్ రావు, హనుమకొండ టీజీవో అధ్యక్షుడు మురళీధర్ రావు, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆకవరం శ్రీనివాస్ కుమార్, మేన శ్రీను, యం. కిరణ్మయి, శ్రీప్రియ, పవిత్ర, శ్రీ లక్ష్మి, హేమలత, ఫణి కుమార్, కోశాధికారి రాజేష్ కుమార్, అప్పయ్య, నవీన్ కుమార్, కోల రాజేష్, శ్రీనివాస్, మాధవ రెడ్డి, రఘుపతి రెడ్డి, వాసం శ్రీనివాస్, విక్రమ్, శ్రీనివాస్ రావు, వినోద్, సంతోష్, సతీష్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాజేశ్వర్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Most Popular