Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణఐదుశాతం రిబేట్ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

ఐదుశాతం రిబేట్ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో గురువారం రెవెన్యూ అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన పన్ను వసూళ్ల పై సమీక్ష కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐదుశాతం పన్ను రిబెట్ చెల్లింపు అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదిశాతం అదనపు రిబెట్ వసూలు జరపాలని సిబ్బందికి సూచించారు,. గత సంవత్సరంపదిహెడు కోట్ల రూపాయాలు వసూళ్లు జరిగాయని, ఈ సంవత్సరం .20 కోట్ల రూపాయాల వసూళ్ల లక్ష్యంగా పనిచేయాలని, నిర్దిష్ట లక్ష్యాలు చేరుకోలేని రెవెన్యూ అధికారులు సిబ్బందికి ఈ నెల ఏప్రిల్ 30 తర్వాత షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు.ముందస్తు సమాచారం లేకుండా విధులకు హాజరు అవుతున్న బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. రిబేట్ వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడానికి కరపత్రాలు పంపిణీ చేయాలని, ప్రధానంగా కమర్షియల్ యాజమాన్యాలకు ఇట్టి చెల్లింపు ప్రయోజనాలను వివరించి చెల్లింపులు జరిపేలా ప్రోత్సహించాలని, పన్నుల చెల్లింపునకై అందజేసిన చెక్కులు బౌన్స్ జరిగితే ఆర్ ఐ లు వారి పై కేసులు నమోదు చేయాలని, క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల తీరును రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమం లో అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్ డిప్యూటీ కమిషనర్ లు రవీందర్ కృష్ణా రెడ్డి ఆర్ ఓ లు సుదర్శన్ యూసూఫోద్దీన్ షాహజాది బేగం శ్రీనివాస్ తో పాటు ఆర్ ఐ లు తదితరులు పాల్గొన్నారు

Most Popular