Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణబన్ను న్యూరో హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

బన్ను న్యూరో హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

అయుధంహనుమకొండ:Bannu Neuro Health And Rehabilitation Institute బన్ను న్యూరో హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఘనంగా పండుగ వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా సహకారశాఖ అధికారి నీరజ,రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవి శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీసీఓ నీరజ మాట్లాడుతూ,విద్యార్థుల  ప్రతిభను అభినందిస్తూ,వారికి నూతన అవకాశాలు,ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈవిశ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ప్రత్యేక పాఠశాలలు విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పిల్లల సంతోషానికి కారణమైన ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులను అభినందించారు.
ఈసంక్రాంతి వేడుకలలో భాగంగా, భోగిమంటలు వెలిగించి, పండుగ ప్రత్యేకతను పిల్లలకు తెలియజేశారు. పిల్లలతో కలిసి భోగిపల్లు పోసి, పల్లె వాతావరణంలో పండుగను జరుపుకున్నారు. అదనంగా, రంగవల్లులు వేసి పతంగులను ఎగురవేసి ఉత్సాహంగా పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బన్ను స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమారి, మొహమ్మద్ నేహాల్ , స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, అతిథులు పాల్గొన్నారు.

 

Most Popular