Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణవంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి : గ్రేటర్ వరంగల్ నగర మేయర్...

వంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి : గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి.

ఆయుధం వరంగల్
వంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.శుక్రవారం gwmc warangal ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్సర్కిళ్ల, వార్డులవారిగా ఆస్తి, పన్నుల సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతి పై అధికారులతో సమీక్షించారు. నగరంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, నివాస గృహాలు వాణిజ్య సంస్థల నుండి వసూలు చేసిన పన్నుల వివరాలు వార్డుల వారిగా అడిగి మేయర్ తెలుసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.114 కోట్ల 44 లక్షల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 42 కోట్ల 59 లక్షల రూపాయలు వసూలు చేసారని, మిగిలిన పన్నుల సేకరణ లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక బద్దంగా సమష్టిగా కృషి చేశారని అన్నారు. నిర్లక్ష్యాన్ని వీడి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల చివరి నాటికి 60 శాతం పన్నుల సేకరణ జరగేలా అంకితభావంతో కృషి చేయాలన్నారు. అందుకు రోజువారీ, వారం వారిగా లక్ష్యాలను బిల్ కలేకర్లు, వార్డు ఆఫీసర్లు, ఆర్ ఐ లకు కేటాయించి, లక్ష్యాన్ని సాధించేలా ఆర్ ఓ లు, ఉప కమిషనర్లు, అదనపు కమిషనర్ నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆస్తి పన్నుతో సమాంతరంగా నీటి పన్ను సేకరణ పై శ్రద్ధ వహించాలన్నారు. బిల్ కలెక్టర్లు కోరిన మేరకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పన్నుల సేకరణలో టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, పి ఓ ఎస్ మెషిన్లు మరమ్మతులు, మెషీన్లు అన్ని డివిజన్లలో అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఐటి మేనేజర్ ను మేయర్ ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సమీక్షిస్తూ ఇప్పటివరకు జిడబ్ల్యూ ఎంసీ పరిధిలో 93 శాతం సర్వే పుర్తయిందని, పెండింగ్ లో ఉన్న, డివిజన్లలో లేనివారిని పిలిపించి వివరాలు సేకరించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని మేయర్ అన్నారు.ఈ సమీక్షలో ఆదనవు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు కృష్ణ రెడ్డి, రవీందర్, పన్నుల అధికారి శ్రీనివాస్, ఐటీ మేనేజర్ రమెష్,ఆర్ ఓ లు శ్రీనివాస్, శహజాది బేగం, యూసుఫ్ ఉద్దీన్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Most Popular