Friday, April 11, 2025

E-Paper

HomeUncategorizedనడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన కీచకుడు

నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన కీచకుడు

బాలాజినగర్ నగర్ నడిరోడ్డుపై కీచకపర్వం చోటు చేసుకుంది.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగా యువతిపై ఒక కీచకుడు అత్యంత దారుణానికి ఒడికట్టాడు.

శాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను పెద్దమారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. అడ్డుకోబోయిన మహిళను అతి దారుణంగా కొట్టి అందరూ చూస్తుండగానే బట్టలను చింపి వివస్త్రను చేశాడు.

ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన స్థానికులపై కూడా దాడి చేశాడు. ఈ తతంగమంతా తన కన్నతల్లి సమక్షంలో జరగడం, ఆ తల్లి తన కొడుకును సమర్ధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

స్థానికల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధిత మహిళకు రక్షణ కల్పించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది….

Most Popular