Saturday, November 30, 2024

E-Paper

HomeUncategorizedకళ్ల కలకలా? ఈ పని మాత్రం చేయకండి....వైద్యుల హెచ్చరిక....

కళ్ల కలకలా? ఈ పని మాత్రం చేయకండి….వైద్యుల హెచ్చరిక….

ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్న కళ్లకలకల కేసులు

తక్షణ ఉపశమనం కోసం స్టెరాయిడ్ వాడకంపై ప్రజల మొగ్గు

వ్యాధికి ఎడినో వైరస్‌ కారణమైతేనే స్టెరాయిడ్ వాడాలని వైద్యుల సూచన

బ్యాక్టీరియాతో కళ్లకలక వస్తే యాంటీబయాటిక్స్ వాడాలని స్పష్టీకరణ

అతిగా స్టెరాయిడ్ వాడితే దీర్ఘకాలంలో హానీ కలుగుతుందని హెచ్చరిక

ప్రస్తుతం ఎక్కడ చూసినా కళ్లకలకల కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి.

ఇది తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే, కొందరు సొంత వైద్యానికి దిగుతూ స్టెరాయిడ్లు వాడుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్టెరాయిడ్ వాడకంతో తాత్కాలికంగా ఉపశమనం దక్కినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

కంజెక్టివైటిస్ లేదా ఐ ఫ్లూగా పిలిచే ఈ వ్యాధికి ఎడినో వైరస్ కారణమైనప్పుడే స్టెరాయిడ్ వాడకాన్ని మొదలెట్టాలని చెప్పారు.

వ్యాధికి బ్యాక్టీరియా కారణమైనప్పుడు యాంటీ బయాటిక్స్ వాడటమే మేలని తేల్చి చెప్పారు.

20 నుంచి 30 శాతం కేసుల్లో మాత్రమే వ్యాధికి ఎడినో వైరస్ కారణమవుతోందని వెల్లడించారు…!!

Most Popular