Friday, April 11, 2025

E-Paper

HomeUncategorizedతమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..

 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది.

ఈ ఘటనలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి చేరుకుంది. ఈ క్రమంలో ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. రైలులోని S-3 బోగీ నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

భోగిలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది, డ్రైవర్ వెంటనే రైలును బెల్లంపల్లి స్టేషన్‌లో నిలిపివేసి మరమ్మతులు చేశారు. ట్రైన్ బ్రేక్ జామ్ వల్ల భోగిలో పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో బోగీలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరమ్మతుల అనంతరం రైలు బెల్లంపల్లి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరింది…

Most Popular