ఆయుధం న్యూస్ హన్మకొండ
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయితో కలసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూసమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాల అమలు, రోస్టర్ విధానం, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలను సమీక్షించారు.ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. అట్రాసిటీ కేసుల విచారణ, భూవివాదాల పరిష్కారంలో చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిసిపి ధార కవిత, జిల్లా ఆదనవు కలెక్టర్ రవి, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
