ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండవిజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే,

విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే,

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను సోమవారం హనుమకొండలో ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌ పాయి గారు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కేంద్రాలను ప్రారంభించారు.హనుమకొండ బస్టాండ్ ఆవరణలో, అలాగే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తుల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను వారు పరిశీలించారు.ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో విజయ డెయిరీ కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు, ముఖ్యంగా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులు, సిబ్బందికి విజయ డెయిరీ ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రదేశాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఇటువంటి కేంద్రాల ఏర్పాటు ద్వారా నాణ్యమైన పాల ఉత్పత్తులను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి విజయ డెయిరీ సిబ్బందితో మాట్లాడి విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉన్న పాల ఉత్పత్తులు, వాటి విక్రయ విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా అవసరమైన ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ డీడీ ధనరాజ్. జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!