ఆయుధం న్యూస్ వరంగల్
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి శుక్రవారం హైద్రాబాద్ నుండి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొనిమాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ నగరంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ప్రతిపాదించిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల వివరాలను వెల్లడించారు.నగరంలో ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి, రవాణా ఆధారిత పట్టణాభివృద్ధి, ప్రాంతీయ ప్రణాళిక, పట్టణ పునరుద్ధరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, నగర ప్రాంతాల పునరాభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.ఈఆఈ వీడియో కాన్ఫరెన్స్లో సిపీఓ అజిత్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, రవికుమార్, సంజయ్ కుమార్, భీమ్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
