ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతయాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్
యాదగిరి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలోని వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రులు కలసి వేద పాఠశాలతో పాటు, స్వామిజీ ఆలయంలో 99.55 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేద పాఠశాలకు శంకుస్థాపనకు 43.80 కోట్లరూపాయలు,కొండపై స్వామిజీ నిత్య కళ్యాణ మండపం నిర్మాణంకు రూ. 9.87 కోట్లు.వైకుంఠ ద్వారం నుండి కొండ వరకు ఉన్న మెట్ల మార్గంపై కప్పు నిర్మాణంకు రూ. 1.41 కోట్లు.రథశాల వైపు వెళ్లే మాడ వీధులకు రూ.1.35 కోట్లతో మెట్ల నిర్మాణం.రూ 43.12 కోట్లతో వసతి గృహాలు దీక్షా పరుల సదనం నిర్మాణంకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి,చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!