ePaper
Friday, July 24, 2026
ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతసమృద్ధిగా వర్షాలు కురవాలని యాదాద్రిలో వరుణ యాగ పూర్ణాహుతి.

సమృద్ధిగా వర్షాలు కురవాలని యాదాద్రిలో వరుణ యాగ పూర్ణాహుతి.

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ యాద‌గిరిగుట్ట‌
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర అటవి పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నాను.మన భారతీయ సంస్కృతిలో ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తాం. వరుణ యాగం అనేది కేవలం వైదిక క్రతువు మాత్రమే కాదు.. ప్రకృతి సమతుల్యత, ప్రజల శ్రేయస్సు, రైతాంగ సంక్షేమం కోసం చేసే పవిత్ర సంకల్పమ‌ని అన్నారు.రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని, చెరువులు, నదులు, జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడాలని, పచ్చని తెలంగాణ మరింత పచ్చదనంతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రకృతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే చర్యలతో పాటు, దైవానుగ్రహం కోసం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!