ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
వరంగల్ జిల్లాలో వన మహోత్సవం–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి, శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా మొక్కలు నాటి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిఖిలతో కలిసి జిల్లా స్థాయి మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ (డీఎల్‌ఎంసీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా మొక్కల నాటకం, లక్ష్యాల సాధన, జియో ట్యాగింగ్ పురోగతి, మొక్కల సంరక్షణ చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.జిల్లాకు ఈ ఏడాది 25,51,248 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు 7,27,612 మొక్కలు నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు.టార్గెట్ పూర్తి చేయని అధికారులను అందుకు గల కారణాలను తెలుసుకునినిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్క మనుగడను నిర్ధారించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.మొక్కల జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి మొక్కను తప్పనిసరిగా నమోదు చేయాలని, వాటి సంరక్షణపై సంబంధిత శాఖలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని శాఖలన్నీ రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో సమన్వయంగా పనిచేయాలని, మిగిలిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, జడ్పీ సీఈఓ రాంరెడ్డి,డిఆర్డిఓ నాగపద్మజా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!