ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్బిక్షాటన రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలి

బిక్షాటన రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
వరంగల్ నగరాన్ని బిక్షాటన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బిక్షాటనకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారికి అవసరమైన సంరక్షణతో పాటు గౌరవప్రదమైన జీవనానికి మార్గం చూపాలని సూచించారు.మంగళవారం హన్మకొండ పరిధిలోని భీమారంలో మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, జిడబ్ల్యుఎంసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ పునరావాస కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో బిక్షాటన నుంచి పునరావాసం పొందుతున్న వారికి కల్పిస్తున్న వసతి, భోజనం, వైద్య సేవలు తదితర సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన SMILE (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీ హుడ్ అండ్ ఎంటర్ప్రైజ్) కార్యక్రమంలో భాగంగా బిక్షాటన చేసేవారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందిస్తూ పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బిక్షాటన చేయకుండా, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వారిని తరలించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి వసతి, పోషకాహారం, వైద్య సేవలు, వ్యక్తిగత పరిశుభ్రత, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధికి అవసరమైన సహకారం అందించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ తెలిపారు. కేవలం బిక్షాటనను నిరోధించడం మాత్రమే కాకుండా, సంబంధిత వ్యక్తుల పరిస్థితులను అర్థం చేసుకుని వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.అనంతరం పునరావాస కేంద్రం నిర్వాహకులు నిర్వహిస్తున్న రిజిస్టర్లు, లబ్ధిదారుల వివరాలను కమిషనర్ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవలు, భోజనం, వసతి తదితర అంశాలపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. కేంద్రం నిర్వహణలో అవసరమైన మౌలిక వసతులు, సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నగరంలో బిక్షాటన చేస్తున్న వారిని గుర్తించడం, వారి వివరాలను నమోదు చేయడం, అవసరమైన వారికి పునరావాసం కల్పించడం వంటి అంశాల్లో బల్దియా అధికారులు, పోలీసు శాఖ, మెప్మా, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.ఈ తనిఖీలో అదనపు కమిషనర్ జోనా, మెప్మా పీడీ రాజేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీఎంసీ రజితా రాణి, టీఎంసీలు రమేష్, వెంకట్ రెడ్డి, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అంజలి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!