ఆయుధం న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్ లో తెలంగాణ పొదుపు, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్. అధ్యక్షుడు బిట్ల కృష్ణ ఆధ్వర్యంలో గురువారం నాడు యాబై లక్షల రూపాయలను సభ్యులకు రుణాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా కూరగాయల మార్కెట్ లో ఫైనాన్స్ వ్యాపారుల చేతిలో మోసపోకుండా ఉండాలని వ్యాపారులకు సంఘం అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొలనుపాక సురేష్, సామల రాజు, నమిండ్ల సూరయ్య, పాపని భాస్కర్, మురళి, గోపాల్, కోమటి రాజు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

