ఆయుధం న్యూస్ హన్మకొండ
శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు.పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని,ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో కాజీపేట, హన్మకొండ ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావు తో పాటు సెంట్రల్ జోన్ పరిధిలోని ఇన్స్ స్పెక్టర్లు అన్ని మతాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
