ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్అభివృద్ది ననులపై కలెక్టర్ సమీక్ష

అభివృద్ది ననులపై కలెక్టర్ సమీక్ష

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
జిల్లా కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జేఎసీఆర్‌డీఎల్ఐఎస్, కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (కేఎల్ఐఎస్), వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్ పార్క్ (కేఎంటీపీ), ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్), జాతీయ రహదారి-163జీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల ప్రతినిధులతో ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు, పెండింగ్ అంశాలు మరియు ప్రస్తుత పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, నిర్దేశిత గడువులో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులను వేగవంతం చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో డీఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమా ఉమారాణి, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్&బీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!