ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళలు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళలు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్) సమ్మయ్య అన్నారు.ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకం లబ్ధిదారుల కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిల్ హాల్‌లో నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, నిల్వ, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై మహిళలకు సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చని సూచించారు.ఆహార ఉత్పత్తుల నిల్వ కాలాన్నిపెంచేందుకు అనుసరించాల్సిన సాంకేతిక విధానాలు, నాణ్యత నియంత్రణ ప్రమాణాలు, ఆహార భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై నిపుణులు శిక్షణ అందించినట్లు చెప్పారు. మహిళలు ఈ శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన మహిళా సంఘాల సభ్యులకు రెండు రోజుల పాటు, కాజీపేట సర్కిల్‌కు చెందిన సభ్యులకు మరో రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో శిక్షణ సంస్థ ప్రతినిధులు, కాజీపేట సర్కిల్ టీఎంసీ కె. వెంకట్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సునీల్ కుమార్,స్వాతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!