ఆయుధం న్యూస్
హన్మకొండ ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్మించిన అంగన్వాడి భవనాన్నిశుక్రవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం,అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళల, బాలల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రీప్రైమరీ స్కూల్ లు ఏర్పాటుచేయబోతున్నామని, డైట్ చార్జెస్ పెంపు, అత్యాధునిక విద్యాప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల విద్యాభివృద్ధికి, గర్భిణీలు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో కీలకమనితెలిపారు.పిల్లలకు పోషకాహారం,ప్రాథమిక విద్య,ఆరోగ్య సేవలు అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
