ePaper
Friday, June 12, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వాడాలి

పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వాడాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,  హనుమకొండ జిల్లా ఎన్జీసీకోఆర్డినేటర్ లు సంయుక్తం గా కళాశాలల విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈప్రచార కార్యక్రమంలో హనుమకొండ టీజీపీసీబీ నోడల్ అధికారి జీముత వాహన ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై పరిచయ ప్రసంగం చేసి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించారు. పర్యావరణ అనుకూల జీవవిచ్ఛిన్నమయ్యే ఉత్పత్తులను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను పూర్తిగా నిషేధించడానికి ప్రజల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని ప్రముఖంగా పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్  జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి మాట్లాడుతూ ఏకవీనియోగ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు గాజు, స్టీల్ బాటిల్స్ ,విస్తర్లు మొదలగు సహజ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!