ఆయుధం న్యూస్ హనుమకొండ
డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి అన్నారు.
హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ఎల్కతుర్తి జంక్షన్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ఇంకా మిగిలి ఉన్న డ్రైనేజీ పనులను వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రాజెక్టు అధికారి అజిత్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
