ePaper
Friday, August 7, 2026
ePaper
Homeఇంటర్నేషనల్తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యమ‌ని డిప్యూటి సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన 19వ ATA జాతీయ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైల కోసం సింగిల్-విండో విధానం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వేగవంతమైన అనుమతులు అందిస్తామ‌ని మూసీ నదీ పునరుజ్జీవనం, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి ప్రధాన ప్రాజెక్టులలో మీరందరూ పాల్గొనాలని కొరారు.ఎన్నారైలు వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్ర‌ఢుత్వం ఒక ప్రత్యేక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని. ఎన్నారై ఓటరు నమోదు సంబంధిత విషయాల వివరాల కోసం, మీరు భారత ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాల‌ని సూచించారు. రాష్ట్రాన్ని ప్రపంచ ప్రమాణాలకు తీసుకువెళ్లే ఈ ప్రయత్నంలో ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషించాలనిబాల్టిమోర్‌లో జరుగుతున్న 19వ ఏటీఏ జాతీయ సదస్సులో మీ అందరితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందాన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!