ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండభద్రకాళి బండ్ పై సందర్శకులకు అందుబాటులోకి బ్యాటరీ వెహికల్

భద్రకాళి బండ్ పై సందర్శకులకు అందుబాటులోకి బ్యాటరీ వెహికల్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హ న‌గ‌రంలోని భద్రకాళి బండ్ పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ను ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన బ్యాటరీ వెహికల్ ను ప్రారంభించిన అనంతరం కుడా సిపిఓ అజిత్ రెడ్డి నడపగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, తదితరులు భద్రకాళి బండ్ పై ప్రయాణించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!