ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం పారిశుధ్య నిర్వహణపై అధ్యయనం

ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం పారిశుధ్య నిర్వహణపై అధ్యయనం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థ (MSSRF) – చెన్నై బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునిసిఫ‌ల్ కార్పోరేష‌న్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్.వెంకన్నతో MSSRF బృందం సమావేశమైంది. నగరంలో అమలవుతున్న పారిశుధ్య నిర్వహణ విధానాలు, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేరు సేకరణ, స్వచ్ఛ ఆటోల నిర్వహణ, పారిశుధ్య సిబ్బంది విధులు, వ్యర్థాల ప్రాసెసింగ్ తదితర అంశాలపై కమిషనర్‌తో బృంద సభ్యులు చర్చించారు.అనంతరం మునిసిప‌ల్ శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై డివిజన్ల వారీగా పారిశుధ్య పనుల నిర్వహణ, సిబ్బంది విధులు, వ్యర్థాల సేకరణలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.తదుపరి శానిటరీ జవాన్లతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారి విధుల నిర్వహణ, ఇంటింటి వ్యర్థాల సేకరణ, పారిశుధ్య పనుల్లో ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల నుంచి అందుతున్న సహకారం తదితర అంశాలపై MSSRF బృందం వివరాలు సేకరించారు.అనంతరం మున్సిపల్ కార్పొరేషన్‌ స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో బాలసముద్రం ప్రాంతంలో సమావేశమై ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, రోజువారీ రూట్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారుఅదేవిధంగా కంపోస్టింగ్, బయోమెథనేషన్ యూనిట్ సిబ్బందితో సమావేశమై సేంద్రియ వ్యర్థాల సేకరణ, కంపోస్టింగ్, బయోమెథనేషన్ ప్రక్రియ, యూనిట్ల నిర్వహణ తదితర అంశాలను బృందం తెలుసుకుంది.మొదటి రోజు పర్యటనలో భాగంగా నక్కలగుట్టలోని DRCని కూడా MSSRF బృందం సందర్శించి అక్కడి కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో ప‌రిశీంచారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు నగరంలోని వివిధ స్థాయిల్లో పారిశుధ్య నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందితో ప్రత్యక్షంగా సమావేశమై వారి అనుభవాలు, సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. . బుధవారం కూడా బల్దియా పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి అధ్యయనం కొనసాగించనుంది.ఈ సమావేశంలో ముఖ్య ఆరోగ్యధికారిడా .రాజారెడ్డి,సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్ కుమార్,ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్ సూపరిండెంట్ బాకం సంతోష్ డిప్యూటీ ఇంజనీర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!