ePaper
Monday, October 12, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండవిజయ తెలంగాణ వరంగల్ డెయిరీ అభివృద్ధికి రూ.1.85 కోట్ల నిధులు మంజూరు

విజయ తెలంగాణ వరంగల్ డెయిరీ అభివృద్ధికి రూ.1.85 కోట్ల నిధులు మంజూరు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ: వరంగల్ పాల పరిధిలోని విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, మరమ్మతులు మౌలిక వసతుల మెరుగుదల కోసం తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య. మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేర‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బజ్పాయ్ 1.85 కోట్ల రూపాయాల నిధుల మంజూరూ కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొదటి విడతగా రూ.89.50 లక్షలు నిధులు మంజూరు చేయుటకు ఉత్తర్వులు ఇచ్చారు.విజయ తెలంగాణ డెయిరీని ఆధునీకరించి, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, పాడి రైతులకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని వరంగల్ ఉపసంచాలకులు ధనరాజ్ తెలిపారు.విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, ఆధునీకరణ పనుల దృష్ట్యా విజయ తెలంగాణ డెయిరీ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా లోని వరంగల్ డెయిరీలో ప్యాకింగ్ కార్యకలాపాలను అక్టొబ‌ర్ ప‌ద‌వ తేదినుండి తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. . అయినప్పటికీ, వినియోగదారులకు పాలు పాల పదార్థాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా, మెగా డెయిరీ, రావిర్యాల నుండి పాలు పాల పదార్థాలను దిగుమతి చేసి, గ్రేటర్ వరంగల్ పరిధిలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామ‌నిఈ నేపథ్యంలో పాల పంపిణీదారులు, ఏజెంట్లు, విక్రయదారులు, వినియోగదారులు పాడి రైతులు సహకరించి, విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి కార్యక్రమాలకు విజయవంతం కావడానికి తోడ్పడాలని అధికారులు కోరారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!