ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండరోడ్డుప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

రోడ్డుప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో రోడ్లు, భవనాలు శాఖ ఆధ్వర్యంలో.జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రోడ్డు భద్రత సంబంధించి చేపట్టిన చర్యల గురించి ఆర్ అండ్ బి ఈఈ దేవిక వివరించారు.
కోమటి పల్లి పరిధిలో ఉన్న ఎన్ హెచ్ రోడ్డు పై ట్రక్ లే బై ఏర్పాటు కు చర్యలు , వంగపహాడ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్ హెచ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశం లో
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలకు విరుద్ధంగా హెవీ వాహనాలు, ప్రైవేట్ టాక్సీలు రోడ్ల పక్కన నిలిపి ఉంచడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.రహదారులపై లైన్ మార్కింగ్ సరిగ్గా ఉండాలన్నారు. నూతనంగా బీటీ రోడ్డు వేసిన హసన్ పర్తి వైపు లైన్ మార్కింగ్, స్టడ్స్ ఏర్పాటు చేయాలని ఎన్ హెచ్ అధికారులను ఆదేశించారు. వంగపహాడ్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ ఎన్. రవి, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్ హెచ్ మేనేజర్ లింగయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!