ePaper
Saturday, October 17, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
వైద్య ఖర్చుల భారం కారణంగా పేదలు ఇబ్బందులు పడకూడదని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.గురువారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో పాటు తెలంగాణా రాష్ట్ర వైద్యం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చూంగ్తు, కూడా చైర్మెన్ గుండు సుధారాణి, వరంగల్,హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్ పాయి,ఎన్పిడిసిఎల్ సిఏండి వరుణ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇంచార్జ్ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఉత్తర తెలంగాణ ప్రజలు అత్యాధునిక వైద్య చికిత్సల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, వరంగల్‌లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోందన్నారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేదల ఉచిత వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుండి పరిమిత వైద్య సేవలను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే నవంబర్ లో మరిన్ని వైధ్య సేవలు అంధుబాటులోకి తీసుకువచ్చి డిసెంబర్ నెల చివరికల్లా పూర్తి స్థాయిలో వైధ్య సేవలను అందిస్తామన్నారు . ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా ఖమ్మం ,వరంగల్,నల్గొండ,ఆదిలాబాదు,మహబూబాబాద్,మెదక్ జిల్లాల ప్రజలు యంజిఎంలో నాణ్యమైన వైద్య అందుతుందని నమ్మకంతో వస్తున్నారని,ఆ నమ్మకాన్ని మరింత బలపడేలా ఉండేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది..ఈ నిర్మాణం తుది దశకి చేరుకుందన్ని వారు పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు.

ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోజుకు సుమారు మూడు వేల మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నామని మంత్రి తెలిపారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మందికి వైద్య సేవలు అందించే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
ఈ పరిశీలనలో డీఎంఈ డా. వాణి, డా విమల థామస్,అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాజి రెడ్డి,ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రాంకుమార్, ఆర్‌ఎంఓ డా. అశ్విన్‌తో,వరంగల్ ,నర్సంపేట ఆర్డీవోలు సుమా,ఉమారాణి పాటు ఆరోగ్య, వైద్య, ఇంజినీరింగ్, శాఖలకు చెందిన సంబంధిత అధికారులు, వైధ్య అధికారులు , సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!