ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండవరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం..

వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం..

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ లోని 55, 56 డివిజన్ పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై ముఖ్య నాయకులతో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన గ్రాడ్యుయేట్స్ లను గుర్తించి, కొత్త ఓటరు నమోదులు పెద్ద సంఖ్యలో జరిగేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరు నమోదుపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి మసూద్ , ఆత్మ‌కూర్ మార్కెట్ మాజీ చైర్మ‌న్ బండి ర‌జినికుమార్ 55వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు డివిజన్ మాజీ అధ్యక్షులు రవీందర్ 56 డివిజన్ మాజీ కార్పొరేటర్ సిరంగి సునీల్ డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!