ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండగ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ :
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవనం పక్కన గల ఖాళీ స్థలంలో నూతన భవన నిర్మాణానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు శంకుస్థాపన చేశారు. ఉదయం  పురోహితుల వేదమంత్రోఛ్చారణల మద్య పూజా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ఆదాయం పెంపు లక్ష్యంగా మా కమిటీ నూతన భవన నిర్మాణానికి ఏకగ్రీవంగా తీర్మాణంచిందని, అందులో భాగంగా మంగళవారం రోజు శంకుస్థాపన చేసి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో  కమిటీ బాధ్యులు యంసాని శ్రీనివాస్, వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్థన్, వీరగోని హరీష్, జనగాని అంజనేయులు, ఎండీ నయీంపాషా, కందుకూరి సంజీవ్, టీయూడబ్ల్యు  ఐజెయూ హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం కేశవమూర్తి,  ఉట్కూరు సాయిరాం, నేతలు వల్లాల వెంకటరమణ, రామాచారి, శోభన్ బాబు, తదితరులు హజరయ్యారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!