ePaper
Wednesday, November 4, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి:

నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి:

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
నరకాసుర వధ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.ఈ నెల 6వ తేదీన వరంగల్‌లోని రంగలీల మైదానంతో పాటు రంగశాయిపేటలోని మహాకాళి దేవాలయం సమీపంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమాల ఏర్పాట్లను బుధవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా న‌గ‌ర‌పాల‌క సంస్థ తరఫున చేపట్టాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!