ePaper
Saturday, October 31, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ వ్యక్తి మేకల రవి

నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ వ్యక్తి మేకల రవి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్: నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ మేకల రవి అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం వరంగల్ నగరానికి చెందిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, మాజీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మేకల రవి(57) అనారోగ్యంతో మరణించారు. రవి మరణవార్త విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాసరావు హుటాహుటిన వారి గృహానికి వెళ్ళి రవి భౌతిక దేహంపై సిపిఐ జెండాను కప్పి పూల మాల వేసి నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ మేకల రవి అనారోగ్యంతో అమరత్వం పొందడం బాధాకరమని, రవి కష్టనష్టాల్ని ఎదుర్కొని మంచితనంతో, కలుపుకోలుతనంతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. మేకల రవి అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) లో వరంగల్ నగర కార్యదర్శిగా పని చేసి, అనంతరం సిపిఐ వరంగల్ నగర కార్యదర్శిగా మూడు పర్యాయాలు, మాజీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా పని చేసి పార్టీ రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేయడం జరిగిందని అన్నారు. నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడ్డ వ్యక్తి మేకల రవి అని అన్నారు. రవి మరణం ఆ కుటుంబానికి, సమాజానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, హనుమకొండ జిల్లా కర్రే బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు తోట బిక్షపతి, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, పార్టీ నాయకులు మద్దెల ఎల్లేష్, గన్నారపు రమేష్, ఎన్ ఎ స్టాలిన్, గుండె బద్రి, సంగీ ఎలెందర్, శంకరయ్య, అక్కెపల్లి రమేష్, జన్ను రవి, సండ్ర కుమార్, మునిగాల బిక్షపతి, సాంబమూర్తి, పరికరాల రమేష్, యాకంబ్ర చారి, మాలోత్ శంకర్ నాయక్, ల్యాదల్ల శరత్, మస్కా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!